
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
వరంగల్ నూతన మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను మంత్రులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
వరంగల్ జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న నూతన మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి , శ్రీమతి సీతక్క తో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆసుపత్రి నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి, పనులకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న ఈ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే వరంగల్తో పాటు చుట్టుపక్కల జిల్లాల ప్రజలకు కూడా ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.
పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం వైద్య రంగానికి ప్రాధాన్యత ఇస్తోందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆసుపత్రి నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టి, ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని తెలిపారు.
ప్రజలకు మెరుగైన వైద్యం.. ఆధునిక వైద్య సదుపాయాలు.. ఆరోగ్య తెలంగాణ దిశగా ప్రజా ప్రభుత్వం ముందడుగు వేస్తోంది.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి, సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తోందని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీలు వేం నరేందర్ రెడ్డి , బలరాం నాయక్ గారు, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి , రేవూరి ప్రకాష్ రెడ్డి , ఎమ్మెల్సీ సారయ్య , కూడా చైర్మన్ గుండు సుధారాణి , గ్రంథాలయ సంస్థ చైర్మెన్ అజీజ్ ఖాన్, హన్మకొండ జిల్లా డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంటకట్రంరెడ్డి , వరంగల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు మహమ్మద్ అయూబ్,హన్మకొండ జిల్లా కలెక్టర్ శ్రీమతి చాహత్ బాజ్పాయ్, వరంగల్ జిల్లా కలెక్టర్ శ్రీమతి సత్య శారదా దేవి, చైర్మెన్ లు, జిల్లా ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
