
గెలుపు గుర్రాల వేటలో మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి
అభ్యర్థుల ఎంపికపై నాలుగు రోజులుగా కసరత్తు
క్షేత్రస్థాయి అభిప్రాయాలకే ప్రాధాన్యం
స్థానిక ఎన్నికలకు మంత్రి వ్యూహం
అన్ని స్థానాలపై కూటమి గురి
స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి వ్యూహరచన చేస్తున్నారు. నాలుగు రోజులుగా నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థుల ఎంపికపై సమీక్షిస్తున్నారు. స్థానిక ప్రజాభిప్రాయం, అభ్యర్థుల ప్రజాదరణ, గెలుపు అవకాశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేస్తున్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
