ఆలయ ధర్మకర్త కొలన్ శ్రీనివాస్ రెడ్డి , (లీడర్) కొలన్ నరసింహారెడ్డి

Spread the love

ఆలయ ధర్మకర్త కొలన్ శ్రీనివాస్ రెడ్డి , (లీడర్) కొలన్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో జరిగే ఈ సంవత్సరం దసరా మహోత్సవాలలో విశేష భాగంగా నవమి. నవమి మహిషాసుర మర్దినిగా అమ్మవారు దర్శనమిచ్చింది. ఈరోజు ఆలయ ధర్మకర్త కొలన్ తేజ శ్రీనివాస్ రెడ్డి మరియు ద్రవ్య దాతలు, వస్తు దాతలతో కలిసి ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలని గ్రామ క్షేమంగా ఉండాలని, పిల్లలకు విద్యాబుద్ధులు కలగాలని, పెద్దలకు వ్యాపారాలలో, ఉద్యోగాలలో ఉన్నత స్థితి కావాలని ఆలయ ప్రధాన అర్చకులు సత్యం స్వామి గారితో చేరి పూర్ణాహుతి కార్యక్రమాన్ని జరిపిస్తూ అమ్మవారి ఆశీస్సులను అందరికీ అందింప చేశారు. ఆ తదనంతరం జరిగినటువంటి అన్న ప్రసాదం అన్నదాతలు సంజీవ ప్రసాద్ మరియు ప్రశాంతి ఆధ్వర్యంలో మహా అన్న ప్రసాదాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిజాంపేట్ గ్రామ పెద్దలు, గ్రామస్తులు మరియు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు…….

You cannot copy content of this page

Scroll to Top