
ప్రజావాణి లేని ఎమ్మార్వో కార్యాలయంలో వినతిపత్రం.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారం కొరకు ప్రజలు కలెక్టరేట్ వరకు వెళ్లడం కష్టం కాబట్టి స్థానిక మండల రెవెన్యూ అధికార కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించాలని ఆదేశించి నెలలు గడుస్తున్నా కుత్బుల్లాపూర్ రెవెన్యూ అధికార కార్యాలయంలో ప్రజావాణి నేటి వరకు నిర్వహించకపోవడం అధికారులు ప్రభుత్వ ఆదేశాలను ఉల్లగించడం కిందకే వస్తుందని దానిద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుందని కావున జిల్లా కలెక్టర్ బాధ్యతలు తీసుకొని ప్రజావాణి నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమామహేష్, జనసేన అధికార ప్రతినిధి సతీష్ నేడు రెవెన్యూ అధికార కార్యాలయం ఎదురుగా మాట్లాడటం జరిగింది.
జగద్గిరిగుట్ట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ భూముల చుట్టూ సర్వే నిర్వహించి ఫెన్సింగ్ నిర్వహించాలని హై కోర్టు తీర్పు ఇచ్చి సమయం గడిచిపోయినప్పటికీ రెవెన్యూ అధికారులు ఇంకా చెయ్యకుండా తాత్సారం చేయవద్దని వెంటనే సర్వే నిర్వహించి ఫెన్సింగ్ చెయ్యాలని కోరుతూ నేడు ఎమ్మార్వో కార్యాలయంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. సుమారు 11 గంటలు అయ్యినప్పటికీ అధికారులు రాకపోవడం,ప్రజావాణి నిర్వహించకపోవడం దారుణమని,అధికారులు ప్రజలు ఇచ్చిన వినతిపత్రంలోని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా అనేక ఆలయాలు వెలిశాయి,అనేక స్థలాలు లక్షలకు అమ్ముడుపోయి ఇండ్లు కూడా కట్టుకున్నారని ఇది స్పష్టంగా అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తుందని ఇప్పటికైనా నిర్లక్ష్యం విడి హైకోర్టు ఆదేశాలను అమలు చెయ్యాలని కోరారు..
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమామహేష్,జనసేన అధికార ప్రతినిధి నందగిరి సతీష్, నాయకులు రుంకు సాయికృష్ణ, వేముల రాజు ,కార్తీక్ లు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
