
- మండలంలో జోరుగా వైసీపీ అభ్యర్థి రెంటపల్లి ప్రచారం
ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని ప్రజలను కోరుతున్న రెంటపల్లి
ఎన్టీఆర్ జిల్లా:
ఇబ్రహీంపట్నం
ఇబ్రహీంపట్నం మండలపరిధిలోని కొటికలపూడి లో జడ్పిటిసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి రెంటపల్లి నాగరాజు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు.
మండలంలోని అన్ని గ్రామాల్లోప్రతి గడపకూ తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో రెంటపల్లి నాగరాజు నిమగ్నమయ్యారు.
ప్రచారంలో భాగంగా ఇబ్రహీంపట్నం మండలంలో జడ్పిటిసి అభ్యర్థి, రెంటపల్లి నాగరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో మళ్లీ జగనన్న ప్రభుత్వం రాబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
“నవరత్నాల పేరుతో మన ఇంటికి పండగ వాతావరణం తెచ్చుకుందాం అంటు.రెంటపల్లి నాగరాజు విజయభేరీ మోగిస్తున్నారు ..
రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీని గెలిపించండి.
ఆదరించి, మమ్మల్ని ఆశీర్వదించండి” అనే నినాదంతో రెంటపల్లి,నాగరాజు,ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరాయని, రాబోయే రోజుల్లోనూ ఈ సంక్షేమ పాలన కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని నాగరాజు కోరారు.
జడ్పిటిసి అభ్యర్థిరెంటపల్లి నాగరాజు,ప్రచారానికి అన్ని గ్రామాల నుంచి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోంది.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
