ఎస్పీ కె నరసింహ ఐపిఎస్ ఆదేశాల మేరకు కోదాడ రూరల్ సిఐ రజితారెడ్డి , అనంతగిరి ఎస్ఐ నవీన్ కుమార్ ,మండల కేంద్రంలోని వెంకట్రామాపురం గ్రామం లో సైబర్ నేరాలు, మహిళల భద్రత, షీ టీమ్స్, బెట్టింగ్ యాప్స్, గంజాయి, డ్రగ్స్ మత్తుమందులపై, రోడ్డు ప్రమాదాలపై పోలీసు కళాభృందంతో గ్రామ ప్రజలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. సిఐ రజితా రెడ్డి మాట్లాడుతు జిల్లా ఎస్పి కె నరసింహ ఐపిఎస్ గారి అధ్వర్యంలో సైబర్ నేరాలపై, మహిళల భద్రత, గంజాయి డ్రగ్స్ మత్తు మందులు,గుట్కాపై పటిష్టంగా పనిచేస్తున్నామని తెలిపారు.సైబర్ మోసగాళ్ళ వల్ల మోసాలకు గురి కావద్దు, బ్యాంక్ ఖాతా, ఎ టీ మ్ కార్డ్ వివరాలు, ఒటీపి వివరాలు ఇతరులకు తెలపవద్దు, ఇతరులు ఆశ చూపితే వాటికి ఆకర్షితులు కావొద్దు. బెట్టింగ్ యాప్ లకు దూరంగా ఉండాలి,మెసేజ్ లలో వచ్చే బ్లూ లింక్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దు అని కోరినారు. సైబర్ మోసాలపై1930 టోల్ ఫ్రీ నంబర్ కు పిర్యాదు చేయాలని అన్నారు. అలాగే రోడ్డు నియమ నిబంధనలు తెలుసుకోవాలని అతివేగం ప్రయాణించవద్దు అని వేధింపులపై 100 కు సమాచారం ఇవ్వాలని తెలిపినారు.
ఎస్ఐ నవీన్ కుమార్ మాట్లాడుతూ గ్రామాల్లో శాంతిభద్రతలకు విగాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు
వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు, ఏటీఎం పిన్ నెంబర్లు, సోషల్ మీడియాలో బహిర్గతం చేయొద్దన్నారు. వ్యక్తిగత ఫోటోలను డిపి లుగా పెట్టుకోవద్దని చెప్పారు.మొబైల్ యాప్ లలో వచ్చేటువంటి అనవసరమైన బ్లూ లింకులను క్లిక్ చెయ్యొద్దు అని తెలిపారు. యువత చెడు వ్యసనాల బారిన పడొద్దు అన్నారు.
గంజాయి మత్తుమందులకు సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిస్తే తప్పకుండా పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని తెలియజేశారు.
అనంతరం పోలీసు కళబృందం వారు చక్కటి సాంస్కృతిక, పాటలతో ప్రజలకు అవగాహన కల్పించారు
ఈ కార్యక్రమం నందు హెడ్ కానిస్టేబుల్ అజయ్ కుమార్, కానిస్టేబుల్ నాగరాజు, సాయి కృష్ణ, హోంగార్డు నరసింహ, కళాబృందం ఇంచార్జ్ యల్లయ్య, గోపయ్య, చారి, నాగార్జున,కృష్ణ, గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
