సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
హైదరాబాద్:
రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ పథకాన్ని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్‌లో సీఎం రేవంత్ రెడ్డి, రేపు ప్రారంభించనున్నారు.
రేపు సాయంత్రం 5 గంట లకు బేగంపేట విమానాశ్ర యం నుంచిసీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డిలు హెలికాప్టర్ లో బయలుదేరి సాయంత్రం 5.45 గంటలకు హుజూర్ నగర్‌లోని రామస్వామి గట్టు వద్ద హెలీప్యాడ్‌లో దిగుతారు. అనంతరం ఆ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న 2,160 మోడల్ కాలనీ ఇళ్లను సీఎం పరిశీలిస్తారు.
అక్కడినుంచి రోడ్డు మార్గం లో పట్టణంలోని ఫణిగిరి గట్టుకు వెళ్లే దారిలోని రాజీవ్ ప్రాంగణానికి 6.15 గంటలకు చేరుకుంటారు. ఉగాది పర్వదినం సందర్భంగా బహిరంగ సభలోనే సన్న బియ్యం పంపిణీ పథకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారు.
6.15 గంటల నుంచి 7.30 గంటల వరకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 7.30 గంటలకు హుజూర్‌నగర్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 9.45 గంటలకు హైదరాబాద్‌కు వెళతారు.
ఈ సభలో మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
