పవిత్ర రంజాన్ మాసం పర్వదినంను పురస్కరించుకుని 124 ఆల్విన్ కాలనీ

Spread the love

పవిత్ర రంజాన్ మాసం పర్వదినంను పురస్కరించుకుని 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ కార్యాలయం వద్ద కార్పొరేటర్ ఆధ్వర్యంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ తో కలిసి డివిజన్ లో ముస్లిం సోదరులకు మరియు ఆడపడుచులకు బట్టలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ రంజాన్ మాసం చాలా పవిత్రమైనది అని, రంజాన్ మాసం సందర్భంగా నిష్ఠతో పాటించే ఉపవాస దీక్షలు, దెైవ ప్రార్థనలతో సామరస్యం, శాంతి సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. డివిజన్ లో ఉన్న ముస్లిం సోదరులందరికి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో సమ్మారెడ్డి, పాండుగౌడ్, పోశెట్టిగౌడ్, మజర్ ఫారూఖ్, ఖలీమ్, బషీర్, నికత్ ఫాతిమా, జబీన్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top