కియా పరిశ్రమలో భారీ చోరీ..ఏకంగా 900 కార్ల ఇంజిన్లు మాయం

Spread the love

కియా పరిశ్రమలో భారీ చోరీ..ఏకంగా 900 కార్ల ఇంజిన్లు మాయం

శ్రీసత్యసాయి జిల్లా పెనుగొండ మండలంలో భారీ చోరీ జరిగింది. జిల్లాలోని యర్రమంచి పంచాయతీ పరిధిలో ఉన్న కియా పరిశ్రమలో సుమారు 900 కార్ల ఇంజిన్లు మాయమయ్యాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మార్చి 19న ఈ ఘటనపై కియా యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కియా ప్రతినిధులు అధికారికంగా ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు విచారణ ప్రారంభించారు.

విచారణ కోసం పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. దీనిపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దర్యాప్తు చేస్తోంది. కియా పరిశ్రమకు కంటైనర్ల ద్వారా కార్ల ఇంజిన్లు వస్తుంటాయి.

ఈ క్రమంలో చోరీ జరిగిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

You cannot copy content of this page

Scroll to Top