650 పడకల భవన నిర్మాణ పనులు త్వరిగతిన పూర్తి చేయాలి: కలెక్టర్ తేజస్

Spread the love

650 పడకల భవన నిర్మాణ పనులు త్వరిగతిన పూర్తి చేయాలి: కలెక్టర్ తేజస్

సూర్యపేట జిల్లా : సూర్యాపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో నిర్మిస్తున్న 650 పడకల భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు.ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ వైద్య అధికారులు, టి ఎస్ ఎమ్ ఐ డి సి ఇంజనీరింగ్ అధికారులతో నూతన భవన నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్బంగా కలెక్టర్ నూతన భవన నిర్మాణం ప్లానింగ్ ని పరిశీలించి ఎ అంతస్తులో ఎ డిపార్ట్మెంట్ వస్తుందో అడిగి తెలుసుకొని కొని సూచనలు సూచించి మార్పులు కొరకు టి ఎస్ ఎం ఐ డి సి కి ప్రతిపాదనలు పంపాలని సూచించారు. డిపార్ట్మెంట్ వారీగా హెచ్ ఓ డి లతో సమీక్ష నిర్వహిస్తూ హాస్పిటల్ కి వచ్చే వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. తదుపరి నిర్మాణ పనులు జరుగుతున్న నూతన భవనం అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించి పలు సూచనలు చేశారు. పనులు లో వేగవంతం పెంచి త్వరగా పూర్తి చేసి ప్రజలకి వైద్య సేవల కొరకు అందుబాటులకి తీసుకొనిరావాలని ఇంజనీరింగ్ అధికారులకి సూచించారు. ఈ కార్యక్రమం లో హాస్పిటల్ సూపరిటీడెంట్ డాక్టర్ సత్యనారాయణ, టి ఎస్ ఎం డి సి సి ఈ దేవేందర్, ఈ ఈ జైపాల్ రెడ్డి, హెచ్ ఓ డి లు, ఎ ఈ లు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top