జిల్లా పోలీస్ కార్యాలయం లో ఘనంగా డా.బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు
భారత రాజ్యాంగ నిర్మాత, దళిత హక్కులకు మార్గదర్శకుడు, డా . బాబా సాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన చిత్ర పటానికి జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు ఐపీఎస్ పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ చిన్న తనం నుండే కుల వ్యవస్థను ఎదుర్కొంటూనే ఉన్నత విద్యను అభ్యసించి ఒక ప్రముఖ భారతీయ న్యాయవాదిగా, ఆర్థిక శాస్త్రవేత్తగా, రాజకీయ నేతగా, సంఘ సంస్కర్త గా ఎదిగారని, అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడని, విదేశాలలో విద్యను అభ్యసించి ప్రపంచ దేశాలు ఆశ్చర్యపడేలా అతి పెద్ద ప్రజస్వామ్య భారత రాజ్యాంగo ను తన ఆద్వర్యంలో రచించి దిశ నిర్దేశం చేశారని, స్వాతంత్ర్య భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా, బలహీన వర్గాల ఆశాజ్యోతిగా నిలిచి నేటి యువతకు అదర్శంగా నిలిచిన మహానీయుడని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో డి.ఎస్పి శ్రీ వై. మొగిలయ్య, ఏ. ఓ సతీష్ కుమార్, ఆర్. ఐ వెంకటేష్, గద్వాల్ టౌన్,రూరల్ ఎస్సై లు కల్యాణ్ కుమార్, శ్రీకాంత్, డీసీ అర్బీ ఎస్సై రజిత, ఆర్ . ఎస్సై లు రామకృష్ణ, చంద్ర కాంత్, ఐటీ, డీసీ అర్బి , ఎస్బి విభాగాల సిబ్బంది, సాయుధ దళ సిబ్బంది పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
