వేసవిలో నీటిఎద్దడి కలగకుండా సత్వర చర్యలు చేపట్టాలి

Spread the love

వేసవిలో నీటిఎద్దడి కలగకుండా సత్వర చర్యలు చేపట్టాలి : బిఆర్ ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …

పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ జంట సర్కిళ్లయిన కుత్బుల్లాపూర్, గాజుల రామారం జలమండలి అధికారులతో సమావేశమై జంట సర్కిళ్ల పరిధిలోని వివిధ కాలనీలలో మంచినీటి సరఫరా, నీటి లభ్యత, భూగర్భ డ్రైనేజీ పనులు, నూతన పైప్ లైన్ల నిర్మాణము వంటి వాటిపై
సమీక్షను నిర్వహించారు.

ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ… వేసవిలో జంట సర్కిల్ ల పరిధిలో నేటి సరఫరా, నీటి లభ్యత ను దృష్టిలో ఉంచుకొని నీటి సరఫరా లో ఎటువంటి అంతరాయం కలగకుండా వేసవి చర్యలు చేపట్టాలని, అదేవిధంగా రానున్న వర్షాకాలం ను దృష్టిలో ఉంచుకొని పెండింగ్ లో ఉన్న భూగర్భ డ్రైనేజీ , వరద నీటి కాలువ, మంజీరా పైప్లైన్ పనులను త్వరితగతిన పూర్తిచేసి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలవకుండా చూడాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జలమండలి డీజీఎంలు రాజేష్, శ్రీకాంత్, రవీందర్ నాయక్, మేనేజర్లు రవి, శివ ప్రసాద్, మహేష్, ఈశ్వరయ్య, రోహిణి, ఝాన్సీ, రమ్య భారతి, పూజిత తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top