ప్రభుత్వ పథకాలను సధ్వినియోగం చేసుకోవాలి –మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ తన నివాసం వద్ద రోజువారీ కార్యాచరణలో భాగంగా నియోజకవర్గం ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు..
అనంతరం పలు ఆహ్వానాలు,వినతి పత్రాలను స్వీకరించి సానుకూలంగా స్పందించారు..
ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ..
— కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు..
— ఇది ప్రజా ప్రభుత్వం ఎల్లపుడు ప్రజా సంక్షేమం, ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తుందని అన్నారు..
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా సంఘాలు, ప్రజా ప్రతినిధులు, సంక్షేమ సంఘాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు తదితరులు పాల్గొన్నారు…

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
