ఇన్ఫినిటీ మాల్ లో గేమ్ ఆన్ ప్లే జోన్ ను ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ
హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని ఇన్ఫినిటీ మాల్ లో చిన్నారుల ఆటవిడుపు కోసం విభిన్న రకాల, వినోద భరితాన్ని పంచే ఆటలతో ఏర్పాటు చేసిన గేమ్ ఆన్ ప్లే ఏరియాను ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ , నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ , కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ .
ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ… వేసవి సెలవుల్లో పిల్లలకు ప్రత్యేక వినోదాన్ని అందించేందుకు గేమ్ ఆన్ ప్లే జోన్ ను చందానగర్ లో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.ఇక్కడి పరిసర ప్రాంత ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని, తక్కువ ఛార్జీలతో అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండేలా ప్లే జోన్ ను కొనసాగించాల్సిందిగా నిర్వాహకులను కోరారు. అనంతరం నిర్వాహకులు అభిలాష్, శ్రావ్యలు మాట్లాడుతూ.. చిన్న, పెద్ద వయస్సుతో సంబంధం లేకుండా అందరూ సందడిగా గేమ్స్ ఆడుకునేందుకు వీలుంది. వర్చువల్ గేమ్స్, బౌలింగ్, సాఫ్ట్ ప్లే, క్రికెట్, హ్యూమన్ క్లా, కార్నివాల్ గేమ్స్, డాషింగ్ కార్స్ గేమ్స్ అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు పుట్టినరోజు వేడుకలు, రుచికరమైన భోజనం అందుబాటులో ఉంటాయి.
ఈ కార్యక్రమంలో నాయకులు నాయి నేనీ చంద్రకాంత్ రావు, గేమ్ ఆన్ నిర్వాహకులు, డైరెక్టర్ బాబీ, నటులు సామ్రాట్, రోల్ రైడా, గాయత్రి భార్గవి, జనార్దన్ మహర్షి, తదితరులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
