జార్ఖండ్ లో భారీ ఎన్ కౌంటర్
హైదరాబాద్:
జార్ఖండ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసుల కాల్పుల్లో ఆరుగులు మావో యిస్టులు మృతి చెందారు. భద్రతాబలగాలు, మావోయి స్టుల మధ్య కాల్పులు కొన సాగుతున్నాయి. ఘటనా స్థలంలో పోలీసులు భారీ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.
ఉదయం 5.30 గంటల ప్రాంతంలో. కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు మవోయి స్టులు ఎదురుపడటంతో కాల్పులు జరిపినట్లు తెలిపారు. బొకారో జిల్లాలో CRPF కోబ్రా కమాండోలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు నక్సలైట్లు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.
లాల్పానియా ప్రాంతంలోని లుగు హిల్స్ ప్రాంతంలో ఈ కాల్పులు జరిగాయి.209 కమాండో బెటాలియన్ ఫర్ రిసొల్యూట్ యాక్షన్ కోబ్రా, దళాలు ఈ ఆపరేషన్ నిర్వహించాయి, ఇందులో ఆరుగురు మావోయిస్టులు మరణించినట్లు పోలీస్ అధికార వర్గాలు తెలిపాయి.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
