చిలకలూరిపేట 100 పడకల ఆసుపత్రి

Spread the love

చిలకలూరిపేట 100 పడకల ఆసుపత్రికి నూతనంగా సూపర్డెంట్ గా నియమితులు అయిన డాక్టర్ శ్రీనివాసరావు మాజీమంత్రి, శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సమావేశంలో ప్రత్తిపాటి మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో ఆసుపత్రికి తరచుగా ఆసుపత్రి యొక్క స్థితి గతులు తెలుసుకొని డాక్టర్స్ కి , స్టాఫ్ కి ఉన్న సిబ్బంది కి వచ్చే పేషెంట్లు, ప్రజలతో స్నేహపూర్వకంగా ఉంటూ అవసరం అయిన వైద్య సేవలు అందించాలని తెలిపారు. అలానే ఆసుపత్రికి అవసరం అయిన స్టాఫ్ మరియు వైద్య పరికరాలు గురించి పై అధికారులతో మాట్లాడి అతి త్వరలోనే అందజేయాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top