ఉపాధి హామీ చట్టం,కల్తీ సారా కళ్ళు లాంటి మత్తు పదార్థాలపై అవగాహన కల్పించిన.

Spread the love

ఉపాధి హామీ చట్టం,కల్తీ సారా కళ్ళు లాంటి మత్తు పదార్థాలపై అవగాహన కల్పించిన………………..

డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్
జి.ఉత్తరయ్య

వనపర్తి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శ్రీరంగాపూర్ మండలం నగరాల గ్రామంలో ఉపాధి హామీ పథకం కార్మికులకు చట్టాల గురించి వివరిస్తున్న అవగాహన కార్యక్రమాన్ని డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఉత్తరయ్య. నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి తాకిడి అధికంగా ఉన్న నేపథ్యంలో వడదెబ్బ తాక కుండా టెంటు, ఓ ఆర్ ఎస్ (ORS) ఫస్ట్ ఎయిడ్ కిట్, అందుబాటులో ఉండాలని తెలియజేశారు అలాగే గ్రామంలో కల్తీసారా కళ్ళు లాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని మరియు గుట్కా, గంజాయి, కిక్కైయిన్, హెరాన్ తదితర మత్తు పదార్థాలపై అవగాహన కలిగి ఉండాలని వివరించారు. నీరు పేదలు మహిళలు చిన్నపిల్లలు ఎటువంటి ఫీజు చెల్లించకుండా ఉచిత న్యాయవాదిని నియమించుకునే అవకాశం ఉందని తెలియజేశారు. న్యాయ సహాయం ను పొందుటకు టోల్ ఫ్రీ నెంబర్ 15100 కు సంప్రదించాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో న్యాయవాది జి వెంకటస్వామి, శ్రీరంగాపూర్ ఏ ఎస్ ఐ మన్యపు రెడ్డి వారి సిబ్బంది, పారాలిగల్ వాలంటీర్లు బంకల రవి, దయాకర్, ఫీల్డ్ అసిస్టెంట్ కృష్ణయ్య, నవనీత్ కుమార్ మరియు గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

You cannot copy content of this page

Scroll to Top