లక్షల్లో మొక్కలు నాటెందుకు రంగం సిద్ధం
రైతులకు 4,50,000 మొక్కల ఉచిత పంపిణీకై అవగాహనా ఒప్పందం
చిలకలూరిపేట : రైతుల ఆర్ధిక అభివృద్ధి, ఉద్యానవన అభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణను లక్ష్యంగా పెట్టుకొని, స్థానిక అసిస్ట్ మరియు వ్యవసాయ ఆధారిత టెక్నాలజీ సంస్థ వరాహ మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందాన్ని అసిస్ట్ వ్యవస్థాపకులు డా॥ జాస్తి రంగారావు మరియు వరాహ భాగస్వామ్యాల మేనేజరు ఎం.ఎస్.ఎన్.మూర్తి పరస్పరంగా మార్చుకున్నారు.
ఈ ఒప్పందం ప్రకారం వచ్చే సీజన్ లో 5 కోట్ల 24 లక్షల రూపాయల విలువ కలిగిన 4,50,000 (మామిడి, జీడి, కొబ్బరి, నిమ్మ, ఎర్రచందనం మరియు టేకు) మొక్కలను ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సుమారు పది జిల్లాల్లోని రైతులకు ఉచితంగా పంచనున్నారు
ఈ సందర్భంగా జాష్టి రంగారావు మాట్లాడుతూ అసిస్ట్ స్థాపన నుండే గ్రామీణాభివృద్ది లక్ష్యంగా పనిచేస్తోంది. వరాహ సంస్థతో భాగస్వామ్యంగా, పండ్ల తోటలు మరియు వన జాతుల మొక్కల ఉచిత పంపణీ ద్వారా గ్రామీణ రైతులను స్థిరమైన ఆదాయ మార్గాల వైపు నడిపించగలమనే విశ్వాసం మాకు ఉంది అన్నారు
ఎం.ఎస్.ఎన్.మూర్తి వరాహ పంటల శాస్త్రీయ విశ్లేషణ ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. అసిస్ట్లో కలిసి పని చేయడం వలన మా లక్ష్యం గ్రామీణ స్థాయిలో విజయవంతంగా అమలు అవుతోంది.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
