మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ శ్రీ గౌతమ్ పోట్రు, జిల్లా సహకార సంఘం అధికారి వెంకట్ రెడ్డి కు వినతిపత్రం అందజేసిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ *
*మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కార్యాలయంలో కలెక్టర్ శ్రీ గౌతమ్ పోట్రు, జిల్లా సహకార సంఘం అధికారి టి. వెంకట్ రెడ్డి ను కలిసి కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని బహదూర్ పల్లి డబల్ బెడ్ రూమ్ లబ్దిదారుల సమస్యలపై *కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ * జిల్లా కలెక్టర్ కి, జిల్లా సహకార సంఘం అధికారికి వినతిపత్రం అందజేసి లబ్దిదారుల సమస్యలను పరిష్కరించాలని కోరారు..
అనంతరం శ్రీశైలం గౌడ్ తో పాటు వచ్చిన బహదూర్ పల్లి డబల్ బెడ్ రూమ్ లబ్ధిదారులతో మాట్లాడుతూ పేద ప్రజలపై ఆగహిత్యాన్ని చాలాయిస్తే సహించబోనని..మీరు అధైర్యపడవద్దు అండగా ఉంటానని హామీ ఇచ్చారు..
ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ..
బహదూర్ పల్లి డబుల్ బెడ్ రూమ్ కాలనిలో గత సంవత్సరం ఏప్రిల్ 2024 నుండి లబ్ధిదారుల నుండి ప్రతి నెల మేంటెనెన్సు పేరిట ఒక్కొక్క ప్లాటు నుండి 1000/- రూపాయలు అలాగే సభ్యత్వం కొరకు 1100/-రూపాయలు వసులు చేయడాన్ని ఖండించారు..
16/05/2025 రోజున బహదూర్ పల్లి డబల్ బెడ్ రూమ్ లను సందర్శించి అక్కడ జరుగుతున్న అవకతవకలను తెలుసుకోని సమస్యలపై అరతీశానన్నారు..
లబ్ధిదారుల ఆరోపణమేరకు బహదూర్ పల్లి డబుల్ బెడ్ రూమ్ లో నెలకొన్న సమస్యలపై మరియు నూతన సొసైటీ ఏర్పాటు కొరకు మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ కి, జిల్లా సహకార సంఘం అధికారికి వినతిపత్రం ఇవ్వడం జరిగిందన్నారు..
780 లబ్ధిదారుల కుటుంబల నుండి మైంటెనెన్స్ 1000/-, సభ్యత్వానికి 1100/-, షేటర్స్ కిరాయి, అడ్వాన్స్, కరెంట్ బిల్ పేరిట జరిగిన అవకతవకలపై విచారణ జరుపాలని కలెక్టర్ తో కోరారు..
ఈ కార్యక్రమంలో బహదూర్ పల్లి డబుల్ బెడ్ రూమ్ లబ్దిదారులు,మహిళ సంఘాలు తదితరులు పాల్గొన్నారు..

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
