రాష్ట్ర స్థాయిలో యోగా పోటీలు
** యోగాంధ్ర క్యాంపెయిన్ ప్రారంభంలో కమిషనర్ మౌర్య
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర క్యాంపెయిన్ – యోగా పోటీ ప్రణాళిక ప్రకారం నగరపాలక సంస్థ , జిల్లా, రాష్ట్ర స్థాయిలో యోగా పోటీలు నిర్వహించబడతాయని తిరుపతి మున్సిపల్ కమిషనర్ ఎన్.మౌర్య తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు, పౌరులు ఆరోగ్యకరమైన జీవన శైలిని అవలంబించేందుకు ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఈ పోటీలు మే 26 (సోమవారం) నుంచి జూన్ 18 వ తేదీ వరకు నిర్వహించబడతాయని తెలిపారు. ఇందులో వ్యక్తిగత, గ్రూప్ ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, జ్ఞానపరమైన పోటీలు నిర్వహించబడతాయని తెలిపారు.
పోటీల స్థాయిలు… తేదీలు
1. వార్డు స్థాయి: మే 26 – మే 30, 2025
థీమ్: ప్రతి ఒక్కరికీ యోగా – గ్రామస్థాయి ఆరోగ్యమేలనం
2. నగర స్థాయి: జూన్ 2 – జూన్ 7, 2025
థీమ్: యోగా ద్వారా ఐక్యత – సమాజాలను కలపడం
3. జిల్లా స్థాయి: జూన్ 9 – జూన్ 14, 2025
థీమ్: యోగాతో యువత – ఆరోగ్య భవిష్యత్ నిర్మాణం
4. రాష్ట్ర స్థాయి గ్రాండ్ ఫినాలే: జూన్ 16 – జూన్ 18, 2025
థీమ్: యోగంధ్ర – ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ యోగా ప్రదర్శన
పోటీల తేదీలు.
జూనియర్స్(10 నుండి 18 సంవత్సరాల వయస్సు)
మే 26 వ తేదీ ఉదయం 7.30 నుండి సాయంత్ర 6గంటల వరకు సోలో యోగా, అసనాస్, సూర్య నమస్కారం, ప్రాణాయామం, ధ్యానం.
మిడిల్ ఏజ్ (19 నుండి 35 వయస్సు), సీనియర్స్ (35 సంవత్సరాల పైబడిన వారు. )
మే 27 వ తేదీ ఉదయం 7.30 నుండి సాయంత్రం 6 గంటల వరకు సోలో యోగా, అసనాస్, సూర్య నమస్కారం, ప్రాణాయామం, ధ్యానం.
జూనియర్స్, యంగ్, సీనియర్స్
మే 28, 29 తేదీల్లో ఉదయం 7.30 నుండి సాయంత్రం 6 గంటల వరకు యోగా, యోగా సాంగ్స్, పెయింటింగ్, యోగా స్కిట్, రోల్ ప్లే.
జూనియర్స్, యంగ్, సీనియర్స్
మే 30వ తేదీ ఉదయం 7.30 నుండి సాయంత్రం 6 గంటల వరకు యోగా క్విజ్, పోస్టర్, స్లోగన్, షార్ట్ ఫిలిం, ఫోటోగ్రఫీ పై పోటీలు నిర్వహిస్తారు. ఈ పోటీలను ఆయా వార్డుల్లో నిర్వహిస్తారని తెలిపారు.
నిర్వహణ విధానం
• సచివాలయ, నగర, జిల్లా స్థాయిల్లో కమిటీలను ఏర్పరచి పోటీలు నిర్వహించబడతాయి.
• పాల్గొనదలచిన వారు సచివాలయ కార్యదర్శి, నగరపాలక సంస్థ లేదా జిల్లా స్థాయి నోడల్ అధికారుల ద్వారా రిజిస్ట్రేషన్ చేయించాలి.
• ప్రతి స్థాయిలో పద్ధతి, న్యాయత, భద్రత, ప్రామాణికతకు అధిక ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది. అవసరమైన మౌలిక సదుపాయాలు అందించబడతాయి. నగర పాలక స్థాయి విజేతలు జిల్లాకు, జిల్లా స్థాయి విజేతలు రాష్ట్ర స్థాయి ఫినాలేకు ఎంపికవుతారు. ఇందులో పోటీ న్యాయనిర్ణేతలదే తుది నిర్ణయం. యోగాంధ్ర క్యాంపెయిన్ ద్వారా యువతకు ఆరోగ్యాన్ని, సాంస్కృతిక మౌలిక విలువలను బోధించడమే లక్ష్యం. ఇది ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో ఒక పునాది వేస్తుంది. మరింత సమాచారం కొరకు సచివాలయ కార్యదర్శిని లేదా నగరపాలక అధికారిని సంప్రదించాలని కమిషనర్ తెలిపారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
