నేరచరిత్ర కలిగిన రౌడీ షీటర్లకు, సస్పెక్ట్ షీటర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన……… జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ రావు
సత్ప్రవర్తన అలవర్చు కొన్న వారిపై భవిష్యత్తులో పోలీస్ రికార్డుల నుంచి తొలగిస్తామని ఎస్పీ హామీ
వనపర్తి జిల్లాలోని అన్ని స్టేషన్ల పరిధిలోని నేరచరిత్ర కలిగిన 85 మంది రౌడీ షీటర్లు 75 మంది సస్పెక్ట్ షీటర్లకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రావుల గిరిధర్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది . ఈ సందర్భంగా ఎస్పీ వారిని ఉద్దేశించి మాట్లాడుతూ వివిధ కారణాల చేత పదేపదే దొంగతనాలు కు పాల్పడుతూ రౌడీయిజాని చేస్తూ రౌడీషీటర్లుగా సస్పెక్ట్ సీటర్లుగా పోలీస్ రికార్డులోకి ఎక్కడం జరిగిందని ఇకపై జిల్లాలో ప్రజా జీవనానికి ఇబ్బంది కలగకుండా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఎలాంటి చట్టా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకుండా సత్ప్రవర్తన కలిగి ప్రశాంత మైన జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి గడపాలని సూచిస్తూ ఇకపై ఎలాంటి చట్టా వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొనకుండా సాధారణ జీవితాన్ని గడుపుతున్న వారిపై తమ నిఘ ఉంటుందని అలాంటి వారి పై వివిధ పోలీస్ స్టేషన్లో రౌడీషీటర్లు గా సస్పెక్ట్ షీటర్లుగా ఉన్న వారి పేర్లను పోలీస్ రికార్డుల నుంచి తొలగించడం జరుగుతుందని ఈ సందర్భంగా ఎస్పీ తెలిపారు అలాగే జిల్లాలో ఏదైనా ఎక్కడైనా నేరం జరిగితే పోలీసులకు సమాచారాన్ని అందించే బాధ్యతాయుతమైన పౌరులుగా పోలీసులకు సహకరించాలని ముఖ్యంగా హింసతో ఏదీ సాధించలేమని ప్రతీకార చర్యలతో కాకుండా పరస్పరంచర్చించుకుని సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయనకోరారు ఈ కార్యక్రమంలో సిసిఎస్ సీఐ రవిపాల్ సిసిఎస్ ఎస్ఐ జయన్న పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
