శంకర్‌పల్లి 13వ వార్డులో గల బీఫ్ షాపును తొలగించాలని మున్సిపల్ కమిషనర్ యోగేష్ కు కాలనీవాసుల వినతి
శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలోని 13వ వార్డులో గల బీఫ్ షాపును తొలగించాలని మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ యోగేష్ కు కాలనీవాసులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు విలేకరులతో మాట్లాడుతూ కాలనీలో ఉన్న బీఫ్ షాప్ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కళేబారాల వ్యర్థాలను తీయకుండా అక్కడే వదిలి వేయడం వల్ల ప్రజలు దుర్వాసనను భరించలేక పోతున్నారని పేర్కొన్నారు. కళేబరాల ఎముకలను కుక్కలు ఎక్కడపడితే అక్కడ ఇండ్ల ముందు వేసి వెళ్ళిపోతున్నాయని తెలియజేశారు. వెంటనే కాలనీ లోని ఇండ్ల మధ్య నుండి బీఫ్ షాపును వెంటనే తొలగించాలని ప్రజలు మున్సిపల్ కమిషనర్ ను కోరారు. మున్సిపల్ కమిషనర్ సానుకూలంగా స్పందించినట్టు కాలనీవాసులు తెలిపారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
