అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు:- చేవెళ్ల ఎమ్మెల్యే “కాలే యాదయ్య

Spread the love

అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు:- చేవెళ్ల ఎమ్మెల్యే “కాలే యాదయ్య” .

చేవెళ్ల నియోజకవర్గం : షాబాద్ మండలం అంతారం, షాబాద్, సంకేపల్లి గూడ, నాగర్ కుంట మరియు హైతాబాద్ గ్రామాల్లో నూతనంగా నిర్మించిబోయే ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన చేసిన చేవెళ్ల స్థానిక శాసనసభ్యులు “కాలే యాదయ్య” .

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…
అర్హులైన ప్రతీ ఒక్కరికి తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు అందిస్తుందన్నారు. 66 గజాల స్థలం ఉన్న ప్రతీ ఒక్కరికి ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం నాలుగు విడతలుగా రూ” ఐదు లక్షలు ఇస్తుందన్నారు.

అనంతరం లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నియామక పత్రాలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో మాజీప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామస్తులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top