అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషక పదార్థాలు గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వం అందించనుంది
ఇందిరమ్మ అమృతం పథకం కింద అంగన్వాడీ కేంద్రాల ద్వార గర్భిణీ స్త్రీలు, బాలింతలు,చిన్నారుల కోసం పోషకాహారాన్ని అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.
కొత్తగూడెం క్లబ్ లో మంత్రి శ్రీమతి ధనసరి సీతక్క (అనసూయ) ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కేంద్రాలకు మిల్లెట్లు మరియు పల్లీ చెక్కని అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. గర్భిణీ స్త్రీలు బాలింతలు చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ పోషకాహారాన్ని అందిస్తున్నారు.
యూనిసెఫ్ అభివృద్ధి చేసిన అవగాహన మెటీరియల్ (IEC Material) ను కూడా ఈ సందర్భంగా ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ సహచర శాసనసభ్యులు ప్రజాప్రతినిధులతో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భగా
ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఈ పోషకాహారాన్ని పంపిణీ చేస్తుందన్నారు. ప్రభుత్వ పథకాల ఫలాలు పల్లెప్రాంతాల గర్భిణీలకు బాలింతలకు చిన్నారులకు సక్రమంగా అందేలా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఉన్న సమస్యల పరిష్కారం అంగన్వాడి నూతన భవనాల నిర్మాణం కొరకు మంత్రి కి ఈ సందర్భంగా వినతిపత్రం అందజేశారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
