చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని వేంకటేశ్వరుని వేడుకున్నాను : మాజీమంత్రి ప్రత్తిపాటి
అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపే శక్తిని స్వామివారు చంద్రబాబుకు ప్రసాదించాలి : ప్రత్తిపాటి.
దర్శనానంతరం టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్.నాయుడితో మర్యాదపూర్వకంగా భేటీఅయిన ప్రత్తిపాటి
“రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్న చంద్రబాబునాయుడి ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలని, ఆయన నాయకత్వంలోని కూటమిప్రభుత్వంలో నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలవాలని కలియుగదైవం వేంకటేశ్వరుని వేడుకున్నట్టు మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. మహానాడు చివరిరోజైన ఉదయం ప్రత్తిపాటి తిరుమల శ్రీవారిని దర్శించుకొని, స్వామివారి సేవల్లో పాల్గొన్నారు. దర్శనానంతరం తిరుమల మాడవీధుల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయకత్వంలోని కూటమిప్రభుత్వంలో రాష్ట్రం దినదినాభివృద్ధి చెంది, దేశానికే గర్వకారణంగా నిలవాలని, ఆ దిశగా ఏపీ పురోగతిసాధనకు అవసరమైన శక్తియుక్తుల్ని ముఖ్యమంత్రికి ప్రసాదించాలని స్వామివారిని వేడుకున్నట్టు ప్రత్తిపాటి తెలిపారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
