పదవీకాంక్ష కంటే ప్రజల బాగోగులే ప్రత్తిపాటికి ముఖ్యం : టీ.ఎన్.ఎస్.ఎఫ్, నేత గట్టినేని సాయి
తిరుపతిలో ప్రత్తిపాటి జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించిన టీడీపీ, టీ.ఎన్.ఎస్.ఎఫ్ నేతలు
ప్రజల బాగోగులే ప్రత్తిపాటికి ముఖ్యమని, నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేయాలి.. ఏం చేస్తే తనప్రాంత ప్రజలు సంతోషంగా ఉంటారన్న ఆలోచనలుతప్ప ప్రత్తిపాటికి ఎలాంటి పదవీ కాంక్ష ఉండదని నియోజకవర్గ టీ.ఎన్.ఎస్.ఎఫ్ అధ్యక్షుడు గట్టినేని విజయ్ సాయి తెలిపారు. నియోజకవర్గ టీ.ఎన్.ఎస్.ఎఫ్ విభాగంలో తిరుపతిలో ప్రత్తిపాటి పుల్లారావు జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. మాజీమంత్రి ప్రత్తిపాటి వేంకటేశ్వరుని దర్శనానికి వెళ్లారని తెలుసుకున్న టీ.ఎన్.ఎస్.ఎఫ్ నేతలు నేరుగా తిరుపతి వెళ్లి అక్కడే ఆయన సమక్షంలోనే ఘనంగా పుట్టినరోజు వేడుక నిర్వహించారు. ప్రత్యేకంగా తయారు చేయించిన కేక్ ను ప్రత్తిపాటితో కట్ చేయించిన టీ.ఎన్.ఎస్.ఎఫ్ నేతలు ఆయనకు తినిపించి తమ ఆనందాన్ని ఆయనతో పంచుకున్నారు. అనంతరం ప్రత్తిపాటిని పూలమాలలతో సన్మానించిన టీ.ఎన్.ఎస్.ఎఫ్ నేతలు ఆయన ఆశీర్వాదం తీసుకొని అక్కడినుంచి వెనుదిరిగారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి మల్లెల రాజేశ్ నాయుడు, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ కందుల రమణ, టీడీపీ నేతలు గంగా శ్రీనివాసరావు, గట్టినేని రమేశ్, తూబాటి శ్రీహరి, పిల్లి కోటి , పసుమారు జానీ, కోటపాటి అనిల్, జవ్వాజి హర్ష , పొన్నం శివ, బేరింగ్ నాగూర్, గంగన్నపాలెం చందు, షేక్ జానీ, చందు, తెలుగుయువత నాయకులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
