ఒంటిమిట్ట ఆలయంలో విశేష ఉత్సవాలు ఇవే
తిరుపతి: టీటీడీకి చెందిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో జూన్ 11వ తేదీ పౌర్ణమి నాడు ఉదయం 9.30 గం.లకు శ్రీ సీతారాముల కల్యాణోత్సవం జరగనుంది.
అలాగే దేవుని కడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయంలో జూన్ 03న పుబ్బ నక్షత్రం సందర్భంగా సా.3.30 గం.లకు స్నపనం, సా.5.00 గం.లకు గ్రామోత్సవం జరుగుతుంది.
జూన్ 04న ఉత్తర నక్షత్రం, సా. 3.30 గం.లకు స్నపనం, సా.5 గం.లకు ప్రాకారోత్సవం, జూన్ 15న శ్రవణ నక్షత్రం, ఉ. 10.గం.లకు కళ్యాణోత్సవం, సా.05 గం.లకు గ్రామోత్సవం, జూన్ 27న పునర్వసు నక్షత్రం, మ.3.30 గం.లకు స్నపనం, సా.5.గం.లకు గ్రామోత్సవం జరగనున్నాయి. ప్రతి శనివారం సా. 05 గం.లకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వర స్వామి వారికి గ్రామోత్సవం ఉంటుంది.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
