పేదల వైద్య సేవలకు సహకారం : పద్మారావు గౌడ్
సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన లాలాగూడ నివాసి వసంత, తుకారం గేట్ నివాసి మణెమ్మ లు అనారోగ్యంతో సతమతమవుతున్న దశలో సమాచారం అందుకున్న స్థానిక శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ వారికి రూ.మూడు లక్షల మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి లెటర్ అఫ్ క్రెడిట్ (ఎల్.ఓ.సీ) పత్రాలను చెక్కులను సితాఫలమండీ లోని ఎం.ఎల్.ఏ. క్యాంపు కార్యాలయంలో అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరుపేదలకు నాణ్యమైన భారంగా మారిన దశలో వైద్య సేవలను పొందేందుకు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నామని పద్మారావు గౌడ్ అన్నారు. ప్రజలు అత్యవసర సందర్భాల్లో సితాఫలమండీ లోని తమ కార్యాలయాన్ని సూచించారు. వైద్య సేవలకు అధిక ప్రాముఖ్యతను కల్పిస్తున్నాని పేర్కొన్నారు.. నిమ్స్ ఆసుపత్రిలో రోగులు చికిత్స పొందేందుకు వీలుగా ఈ పత్రాలను అందించామని పద్మారావు గౌడ్ పేర్కొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
