తుడ” ద్వారా పచ్చదనం పెంచేందుకు ముమ్మర చర్యలు

Spread the love

తుడ” ద్వారా పచ్చదనం పెంచేందుకు ముమ్మర చర్యలు
** గార్డెన్ విభాగం ఉద్యోగులతో “తుడ” చైర్మన్ దివాకర్

తిరుపతి: తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (తుడ) ద్వారా తిరుపతి నగరంలో మరింత పచ్చదనం పెంచేందుకు ముమ్మర చర్యలు తీసుకుంటానని తుడ చైర్మన్ “డాలర్స్” దివాకర్ రెడ్డి తెలిపారు. తుడా పరిధిలోని గార్డెన్ డిపార్ట్మెంట్ లో పనిచేసే ఉద్యోగులు దివాకర్ రెడ్డిని మర్యాదపూర్వకం గా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ దివాకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఆశయాల మేరకు తిరుపతిని అన్నివిధాలా హంగులతో మరింత శోభాయంగా తయారు చేద్దామని సూచించారు. అందుకు ప్రజల నుంచి సలహాలు తీసుకుంటూ…. సిబ్బంది ప్రణాళికలను పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. పచ్చదనం పెంపు ద్వారా ఆహ్లాదం కాకుండా స్వచ్ఛమైన గాలితో ప్రజలకు ఆరోగ్యం పంచవచ్చన్నారు. ఈ విషయంలో రాజీ ఉండబోదని స్పష్టం చేశారు. అలాగే తిరుపతి నగరం లోపల, బయట ప్రాంతాల్లో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా మరిన్ని చర్యలు తీసుకోనున్నట్లు దివాకర్ రెడ్డి వెల్లడించారు.

You cannot copy content of this page

Scroll to Top