అంబీర్ చెరువును ప్రగతి నగర్ ప్రజలకు ఒక ఆహ్లాదకరమైన పర్యావరణ వనరుగా అభివృద్ధి చేస్తాం – బి.ఆర్.ఎస్. పార్టీ విప్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద.
నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి ప్రగతినగర్ లోని అంబీర్ చెరువును అభివృద్ధి మరియు పరిరక్షణ పనులపై సమీక్ష కోసం బి.ఆర్.ఎస్.పార్టీ విప్ ఎమ్మెల్యే కె. పి. వివేకానంద మరియు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సంబంధితశఖా అధికారులు మరియు స్థానిక నాయకులతో కలిసి సందర్శించారు – అభివృద్ధి పనులపై సమీక్ష.
ఈ సందర్భంగా చెరువు పరిసర ప్రాంతాలను పరిశీలించి ప్రగతి నగర్ నుండి వచ్చే మురికి నీటిని అంబీర్ చెరువులో కలవకుండా డైవర్షన్ చేసి శంషిగూడ ఔట్ లెట్ లో కలిపి చెరువును కలుషితం కాకుండా చర్యలు చేపట్టాలని, దీని కోసం రూ.90 లక్షలతో రూపొందించిన పనుల ప్రణాళికను త్వరగా చేపట్టి, రానున్న వర్షాకాలం లోపే నిర్మాణం పనులు పూర్తిచేయాలని అధికారులకు సూచించారు.
అలాగే చెరువు నీటి నిల్వ సామర్థ్యం, శుభ్రత, ఫుట్పాత్, వాకింగ్ ట్రాక్ వంటి అభివృద్ధి అంశాలపై అధికారులకు సూచనలు ఇచ్చారు.
ముఖ్యంగా అంబీర్ చెరువును ప్రగతి నగర్ ప్రజలకు ఒక ఆహ్లాదకరమైన పర్యావరణ వనరుగా అభివృద్ధి చేయాలని వారు తెలిపారు. ప్రభుత్వం తరఫున అవసరమైన నిధులు, అనుమతుల కోసం తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ సాబేర్ అలీ, ఇరిగేషన్ శాఖ డి.ఈ.ఈ. నరేంద్ర, ఏ.ఈ.ఈ. లక్ష్మీనారాయణ, కార్పొరేషన్ బి.ఆర్.ఎస్. పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, మాజీ కార్పొరేటర్ గాజుల సుజాత, నాయకులు సాంబశివా రెడ్డి, స్టాలిన్ రెడ్డి, శ్రీకర్ గుప్తా, అర్పిత ప్రకాష్, శిల్పా మరియు స్థానికులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
