పాలకుర్తి శాసనసభ నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే శ్రీమతి యశస్విని రెడ్డి మరియు నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీమతి ఝాన్సి రాజేందర్ రెడ్డి ..
పాలకుర్తి నియోజకవర్గ ప్రజల అభ్యున్నతికి పూనుకునే సంకల్పంతో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పాలకుర్తి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్‌ను మంజూరు చేయడం గర్వకారణంగా, ప్రగతికి నిదర్శనంగా నిలిచింది..
ఈ సందర్భంగా, పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి మరియు నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీమతి ఝాన్సి రాజేందర్ రెడ్డి , హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు, నియోజకవర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ విద్యా సదుపాయం స్థానిక విద్యార్థులకు ఉత్తమ భవిష్యత్తును అందించడంలో కీలకపాత్ర పోషిస్తుందన్నారు..
అదనంగా, వారు సీఎం కి ఈ నిర్ణయం ద్వారా పాలకుర్తి ప్రాంతానికి వచ్చే విద్యా ప్రగతిని వివరించి, త్వరలోనే నిర్మాణ కార్యక్రమాలు వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు..
పాలకుర్తి నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల మద్దతు తెలిపిన ఎమ్మెల్యే కి మరియు ఇంచార్జ్ కి స్థానికులు అభినందనలు తెలియజేశారు..

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
