శేరిలింగంపల్లి జోన్ జోనల్ కమిషనర్ గా నియమితులైన శుభసందర్భంగా హేమంత్ బోర్ఖడే IAS ని శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ , సీనియర్ నాయకులు రఘునాథ్ రెడ్డి , ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ తో మర్యాదపూర్వకంగా కలిసి శాలవతో సత్కరించి శుభాకాంక్షలు తెలియచేసిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ
ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో నెలకొన్న పలు సమస్యలు మరియు చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై జోనల్ కమిషనర్ తో చర్చించడం జరిగింది , పెండింగ్ లో ఉన్న పనులు త్వరితగతిన పూర్తయ్యేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని, అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడలని , అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని, పనులలో వేగం పెంచాలని సకాలంలో నిధులు మంజూరు అయ్యేలా చూడలని , అభివృద్ధి పనులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడలని,
వర్షాకాలంను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ,వర్షాకాలంలో గల ఎదురయ్యే సమస్యల పట్ల పూర్తి స్థాయిలో సన్నద్ధం అయ్యేలా అధికారులకు అదేశాలు ఇవ్వాలని, మాన్ సున్ సిబ్బందిని అప్రమత్తంగా ఉండేలా చూడలని, అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని, రోడ్ల మరమ్మత్తులు చేపట్టాలని PAC చైర్మన్ గాంధీ జోనల్ కమిషనర్ హేమంత్ బోర్ఖడే IAS దృష్టికి తీసుకువెళ్లడం జరిగినది.
అదేవిధంగా చెరువుల సుందరికరణ, పార్క్ లు అభివృద్ధి చేపట్టాలని, రోడ్ల మరమ్మతులు చేపట్టాలని, అభివృద్ధి విషయంలో ఎక్కడ రాజి పడకూడదు అని, అధికారులతో చర్చించి తక్షణమే చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మౌలిక వసతులు ఏర్పాటు కు కృషి చేయాలని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.
దీని పై జోనల్ కమిషనర్ హేమంత్ బోర్ఖడే IAS సానుకూలంగా స్పందించడం జరిగినది.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
