స్విమ్స్ అభివృద్ధికి మరిన్ని నిధులు ఇవ్వండి
** కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాకు భానుప్రకాష్ వినతి
తిరుపతి,: రాయలసీమ జిల్లాలకే తలమానికంగా ఉంటూ ప్రభుత్వరంగ కార్పొరేట్ వైద్య సేవలు అందిస్తున్న తిరుపతి స్విమ్స్ ఆస్పత్రి అభివృద్ధికి కేంద్రం నుంచి మరిన్ని ఉదార నిధులు ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గుడిపల్లి భానుప్రకాష్ రెడ్డి విన్నవించారు. స్విమ్స్ అభివృద్ధిపై కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి జగత్ ప్రకాష్ (జేపీ) నడ్డాను, తిరుపతిలోని కేంద్ర విద్యా సంస్థ అయిన సంస్కృత విద్యా పీఠం యూనివర్సిటీపై కేంద్ర విద్యా మంత్రిని శుక్రవారం దిల్లీలో కలిసి సమస్యలను వివరించారు. తన విన్నపాలను స్వీకరించిన కేంద్ర మంత్రులు అతి త్వరలోనే తిరుపతి రానున్నామని…. అప్పుడు అన్నీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు భానుప్రకాష్ తిరుపతి మీడియాకు తెలిపారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
