మహానాడు సూపర్ సక్సెస్ తో జోష్
** టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకిటీల సురేంద్ర
(చిత్తూరు), తిరుపతి: కడపలో నిర్వహించిన మహానాడు-2025 అత్యంత విజయవంతం అయిందని… అదుర్స్ అని….సూపర్ సక్సెస్ తో పార్టీ శ్రేణుల్లో జోష్ నిండిపోయిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకిటీల సురేంద్ర కుమార్ తెలిపారు. ఆయన జిల్లా టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మహానాడు మొదటి రెండు రోజులలో జరిగిన ప్రతినిధుల సభ లో 25 వేలకు పైగా పార్టీ ప్రతినిధులు పాల్గొని విజయవంతం చేశారని పేర్కొన్నారు. మూడో రోజు పార్టీ బహిరంగ సభలో ఆశించిన సంఖ్య కంటే ఎక్కువగా సుమారు 6లక్షలకు పైగా పార్టీ శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారన్నారు.
ఈ మహానాడు రాయలసీమ పార్టీ చరిత్రలో సరి కొత్త రికార్డు సృష్టించిందన్నారు.
నారా లోకేష్ స్వీయ పర్యవేక్షణలో మహానాడు అద్భుతంగా, అన్ని సౌకర్యాలతో, ఖచ్చితత్వంతో, ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా జరిగిందని తెలిపారు.
ఈ మహానాడు-2025 తెలుగుదేశం పార్టీకి , రాష్ట్రానికి దిశ దశ చూపించిందని సురేంద్ర కుమార్ వెల్లడించారు.
జగన్ పాలనలో సర్వ నాశనం అయిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలోకి తెచ్చేవిధంగా, రాష్ట్ర పునర్నిర్మాణానికి దిశా దశ , మార్గ సూచిక ఇచ్చిందన్నారు. పార్టీ మరో 40 ఏళ్ళు పటిష్టంగా ఉండటానికి నారా లోకేష్ సూపర్ సిక్స్ శాసనాలను మహానాడు ముందు ఆమోదింపచేసి పార్టీకి నూతన శక్తికి మార్గం చూపారని అభినందించారు. ప్రభుత్వానికి ప్రజలే ప్రాధాన్యత, పార్టీకి కార్యకర్తే ప్రాధాన్యత అని స్పష్టం చేసింది ఈ మహానాడు అని చెప్పారు. ఆర్ధిక ఉగ్రవాదులు చేసిన పాపాలకు, నష్టాలకు , అరాచకాలు చట్టబద్ధంగా శిక్షలు తప్పవని స్పష్టం చేశారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
