ఊరుకొండ ఆంజనేయ స్వామి గుడిలో దారుణం
నాగర్ కర్నూల్ జిల్లా ఊరుకొండ మండలం ఊరుకొండ పేట ఆంజనేయ స్వామి గుడికి వచ్చే భక్తులను నిలువెత్తున ముంచుతున్నారు, భక్తిశ్రద్ధలతో శ్రీ ఆంజనేయ స్వామి గుడికి వచ్చిన వారిని గుడిలో తలనీలాలు సమర్పించే కళ్యాణకట్టలో దారుణంగా దోచుకుంటున్నారు, పది రూపాయల టికెట్ కొన్నా సరే ఒక గుండుకు 150 రూపాయలు కచ్చితంగా చెల్లించాలని లేకపోతే గుండు చెయ్యమని మాకు జీతాలు రావట్లేదని ఖరాకండిగా చెప్తున్నారు, కావాలంటే ఎవరికైనా చెప్పుకోండి ఏమైనా చేసుకోండి అంటున్నారు, ఇట్టి విషయమై ఆలయ ఈఓ కి ఫోన్లో సంప్రదిస్తే అందుబాటులోకి రావట్లేదు, సరేలే అని భక్తిశ్రద్ధలతో గుడికి వచ్చిన భక్తులు 150 రూపాయలు ఇచ్చినా సరే అనుకుని గుండు గీయమంటే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఇష్టానుసారంగా గుండ్లు గీకుతున్నారు నెత్తురు మరకలతో గాయాలతో దర్శనమిస్తున్నాయి గుండ్లు, ఇటీవల ఓ కుటుంబం భక్తితో గుడికి వచ్చి రెండు సంవత్సరాల బాబుకు గుండు గీయించారు, చేసేవారు ఘాట్లు ఘాట్లు సరిగ్గా చేయకపోవడంతో బాబు యొక్క తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఎవరి ఇష్టానుసారంగా వారు భక్తుల నుండి పైసలు తీసుకుంటున్నారు, గుండు కూడా సరిగ్గా చేయడం లేదు భక్తిశ్రద్ధలతో మేము వస్తే నిలువెత్తున మమ్ములను ఉంచుతున్నారు, అంటూ బాబు తల్లిదండ్రులు ఆరాధిస్తున్నారు, ఇప్పటికైనా గుడి యాజమాన్యం ఈ వో గుడికి వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా చార్జిల్లా మోత భక్తులపైన మోపకుండా సజావుగా సాగాలని భక్తులు కోరుతున్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
