కేంద్ర మంత్రి కీ శుభాకాంక్షలు తెలిపిన బిజెపి నాయకులు
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ వివాహ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ లోని వారి ఇంటి వద్ద బీజేపీ నాయకులు కలిసి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపడం జరిగింది. అనంతరం బీజేపీ నాయకులు హుజూరాబాద్ నియోజకవర్గంలోని పలు సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకుపోవడంతో మంత్రి సానుకూలంగా స్పందించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారని బీజేపీ నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు . మంత్రి ని కలిసిన వారిలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు,బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకటరెడ్డి,బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి దండు కొమురయ్య, బిజెపి సీనియర్ నాయకులు జీడి మల్లేష్, బిజెపి నాయకులు మొడెం రాజు,
బూరుగుపల్లి రామ్, పొడేటి అనిల్ తదితరులు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
