
క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ పథకాలకు దరఖాస్తుల ఆహ్వానం….
కుట్టు మిషన్, చిరు వ్యాపారం, ఈ-బైక్, ఈ-స్కూటీ, మోటార్ బైక్ యూనిట్లకు అవకాశం….
పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి:
తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి కుట్టు మిషన్, చిరు వ్యాపారం, ఈ-బైక్, ఈ-స్కూటీ, మోటార్ బైక్ యూనిట్ల కోసం అర్హులైన క్రైస్తవ మైనారిటీల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీస్ సంక్షేమ శాఖ అధికారి పి. నరేష్ కుమార్ నాయుడు తెలిపారు.
కుట్టు మిషన్, చిరు వ్యాపార యూనిట్లకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 21 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ-బైక్, ఈ-స్కూటీ, మోటార్ బైక్ యూనిట్లకు 21 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించకూడదు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షల లోపు ఉండాలి.
ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు జూలై 19 నుంచి జూలై 31, 2026 సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
దరఖాస్తులు సమర్పించేందుకు: TGOBMMS పోర్టల్
మరిన్ని వివరాలకు: తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ లేదా 040-23391067 నంబర్‌ను సంప్రదించాలని జిల్లా మైనారిటీస్ సంక్షేమ శాఖ అధికారి పి. నరేష్ కుమార్ నాయుడు తెలిపారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
