
కేటీఆర్ తనయుడు హిమాన్షుకు రాఖీ కట్టిన ఇవాంక
హైదరాబాద్: రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని అశ్వారావుపేట యువజన విభాగం మాజీ నియోజకవర్గ అధ్యక్షులు మోటూరు మోహన్ కుమార్తె ఇవాంక, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మనవడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తనయుడు కల్వకుంట్ల హిమాన్షు రావుకు రాఖీ కట్టారు.
ఈ సందర్భంగా ఇవాంక హిమాన్షుకు రాఖీ కట్టి, స్వీట్లు తినిపించి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను కుటుంబ సభ్యుల సమక్షంలో ఆప్యాయంగా జరుపుకున్నారు.
రాఖీ కట్టిన అనంతరం హిమాన్షు ఇవాంకకు శుభాకాంక్షలు తెలియజేసి, ఆమెకు ఆశీస్సులు అందించారు. ఈ రాఖీ వేడుక ఆత్మీయంగా, ఆనందంగా సాగింది
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
