ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ఏఐసీసీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా ఈవెంట్‌లో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు.*
ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న వక్కీలూ, లీగల్ ఎక్స్పర్ట్లు, కాంగ్రెస్ పార్టీ నేతలు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ,
“దేశ ప్రజల హక్కుల రక్షణ కోసం న్యాయ పోరాటాలు జరగాలి. అందుకోసమే లీగల్ సెల్ పనిచేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన న్యాయవాదుల్ని ముందుకు తీసుకువెళుతోంది,” అని తెలిపారు.
న్యాయ వ్యవస్థ పటిష్టత, సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ న్యాయ పోరాటాలకు బలాన్నిచ్చేలా ఉందని చెప్పారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
