ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేస్తా: ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు …
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మున్సిపాలిటీ శంభీపూర్ లోని కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, యువకులు, వివిధ కాలనీల సభ్యులు, మరియు తదితరులు మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసారు.. ఈ సందర్భంగా పలు సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు. వారు సానుకూలంగా స్పందించి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలియజేశారు……
అదే విధంగా పలు ప్రాంతాలలో జరగబోయే వివిధ శుభకార్యాల వేడుకలు మరియు బోనాల ఉత్సవాల వేడుకల్లో పాల్గొనాలని పలువురు ఆహ్వాన పత్రికలను అందజేశారు..
- చర్చ్ గాగిల్లాపూర్ బీఆర్ఎస్ నాయకులు రంజిత్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఎమెల్సీ శంభీపూర్ రాజు ని మరియు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ ని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా కేక్ కట్ చేయించి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు..*

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
