కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి సబిహా గౌసుద్దీన్ , కురిసిన బారీ వర్షం కారణంగా డివిజన్ పరిధిలోని సబ్దర్ నగర్ మరియు పద్మావతి నగర్ కాంపౌండ్ సరిహద్దు వద్ద ఉన్న సున్నం చెరువు ఇన్‌లేట్ పరిసర ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలించారు.
ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ వర్షం వల్ల నిల్వ నీటి సమస్యలు తలెత్తిన ప్రాంతాల్లో తక్షణమే మురుగు నీటి ప్రవాహాన్ని సులభతరం చేసే చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశించాము. భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు రాకుండా డ్రైనేజ్ వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము అని అన్నారు.
ఈ కార్యక్రమంలో హైడ్రా విమస్ కన్సల్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ సురేష్ రెడ్డి, DE మోహన్, జావీదుద్దిన్, అబ్దుల్ అక్బర్, సుల్తాన్, ఖాజీమ్, ఫ్యూమ్, షానవాజ్, షాహిన్, తదితరులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
