కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫతేనగర్ డివిజన్ కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ జోనల్ కమిషనర్ అపూర్వ చౌహన్ కలిసి ఫతేనగర్ డివిజన్లోని అమృత తండాలో ఉంటున్న నిరుపేదలకు అండగా ఉండాలని.. వర్షం వస్తే వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కొంతమందికి డబల్ బెడ్ రూమ్ లు కేటాయించామని.. ఇంకా కొంతమంది నిరుపేదలు ఉన్నారని వారినీ కూడా మానవతా దృక్పథంతో ఆదుకోవాలని కోరారు..వీరికి కైతలాపూర్ లో అందుబాటులో ఉన్న డబల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించాలని… అమృత తండా ప్రాంతంలో వర్షం వచ్చినప్పుడు అక్కడ ఉన్న నాలా పొంగిపొర్లి వారి నివాసాలు నీట మునిగి వారి పరిస్థితి దుర్భరంగా మారుతుందని.. నిరుపేదలను ఆదుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కమిషనర్ ను కోరారు.. సమస్యను పై అధికారులతో చర్చించి పరిష్కారం దిశగా కృషి చేస్తానని ఈ సందర్భంగా కమిషనర్ అపూర్వ చౌహన్ తెలిపారు…

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
