మీడియా ముసుగులో బ్లాక్‌మెయిల్ చేస్తే కఠిన చర్యలు – గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరిక
గుంటూరు:
మీడియా ముసుగులో బ్లాక్‌మెయిలింగ్ చర్యలకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ స్పష్టం చేశారు.
తుళ్ళూరు సీఐ మాతంగి శ్రీనివాస్‌ను టార్గెట్ చేస్తూ, ఒక వ్యక్తి ఓ చానల్ రిపోర్టర్ సాయంతో కుట్ర పన్నినట్లు విచారణలో తేలిందని ఆయన తెలిపారు. తమ సొంత కార్ అద్దాలు తన వ్యక్తులతోనే పగలగొట్టించి, అందుకు రూ.5 వేల రూపాయలు చెల్లించినట్లు బయటపడిందని ఎస్పీ తెలిపారు.
ఈ ఘటనపై పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారని, ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. మీడియా పేరు దుర్వినియోగం చేసి తప్పుడు ప్రచారాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ వకుల్ జిందాల్ కఠినంగా హెచ్చరించారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
