అభివృద్ధి పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళుతుందని టి పి సి సి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు. బేగంపేట డివిజన్లో బాలాజీ ప్రశాంత్ మనోహర్ లా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కాంగ్రెస్ పార్టీ పతాకాన్ని బండి రమేష్ ముఖ్యఅతిథిగా హాజరై ఎగుర వేశారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తుందన్నారు .సిటీ అభివృద్ధి కోసం సీఎం రేవంత్ విశేషంగా కృషి చేస్తున్నారని అన్నారు .గత టిఆర్ఎస్ పాలనలో పేద ప్రజలకు ఒక్కరేషన్ కార్డు ఇచ్చిన పాపానపోలేదన్నారు. ప్రభుత్వం చేపట్టి ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలపై ఉందన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద మొత్తంలో వారసత్వంగా వచ్చినా అభివృద్ధి కార్యక్రమాల అమలులో ఎలాంటి వెనుకంజ లేనేలేదన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మయ్య ,జైపాల్, నర్సింగ్ రావు, విశాల్, జ్ఞానేశ్వర్ ,దయానంద్, పర్వేజ్ ,అలీ ,అరుణ్, బాలకృష్ణ, అడ్డు, నసీర్, అత్తర్, శివ చౌదరి ,రమాదేవి, ప్రవీణ తదితరులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
