సీఎం సహాయనిధి పేదలకు గొప్పవరం- నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ||
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని నిజాంపేట్ పరిధిలోని మధుర నగర్ వాసులు సి. రాజ్య లక్ష్మి గారు గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతు నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుటకు ఆర్ధిక స్థోమత లేక కుటుంబ సభ్యులు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి గారిని సంప్రదించగా వెంటనే స్పందించి రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ద్వారా బాధితురాలికి శస్త్ర చికిత్స నిమిత్తం రూ. 2,00,000/- ల సీఎం సహాయనిధి – ఎల్వోసీ ని మంజూరి చేయించారు. రూ 2,00,000/- (రెండు లక్షల రూపాయలు ) CMRF – LOC మంజూరి పత్రాలను బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదిరెడ్డి కి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు సిద్దనోళ్ల సంజీవ రెడ్డి, కొలన్ జీవన్ రెడ్డి, ఆలేటి శ్రీనివాస్ రావు, ప్రశాంత్ రెడ్డి, కొలన్ విక్రమ్ రెడ్డి, నవీన్ కుమార్, రాజ్ సుర పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
