కుత్బుల్లాపూర్ నియోజకవర్గం TUWJ (H-143) నూతన కమిటీ ఎన్నికైన సందర్భంగా, నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకరణ మహోత్సవ కార్యక్రమం సూరారం లోని తులిప్స్ హోటల్ లో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి వారి ఆహ్వానం మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హన్మంత్ రెడ్డి నూతనంగా ఎన్నికైన సింగిరెడ్డి కృష్ణారెడ్డి (గౌరవాధ్యక్షులు), ఎమ్ . సుగ్రీవుడు (అధ్యక్షులు), మాధవరెడ్డి (ప్రధాన కార్యదర్శి), ఎర్రోళ్ల బాబు (కోశాధికారి) కమిటీ సభ్యులను అభినందించారు. అనంతరం మాట్లాడుతూ, జర్నలిస్టుల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న వృత్తిపరమైన సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని, అలాగే యూనియన్ భవిష్యత్ కార్యాచరణ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో TUWJ (H-143) యూనియన్ నాయకులు, జర్నలిస్టులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
