కోదాడ మున్సిపాలిటీలో మాలలకు సముచిత స్థానం కేటాయించాలి. పిడతల శ్రీను
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో కోదాడ శాసనసభ్యురాలు నలమాద ఉత్తం పద్మావతి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి పిడతల శ్రీను ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతికి మాలల తరపున వినతి పత్రం అందజేశారు. అనంతరం పిడతల శ్రీను మాట్లాడుతూ మాలలంటేనే కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకు అని కావున ఎస్సీ వర్గీకరణ జీవోను పాటిస్తూ కోదాడ మున్సిపాలిటీ పరిధిలో ఐదు రిజర్వేషన్ స్థానాలకు గాను మాలలకు రెండు. స్థానాలు ఒక కో ఆప్షన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దీనికి ఎమ్మెల్యే పద్మావతి సానుకూలంగా స్పందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోదాడ టౌన్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు లచ్చిమల రామ్మోహన్ రావు కోదాడ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ కామల్ల ప్రవీణ్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాదరి మధు, పాలడుగు నాగరాజు, తుమ్మల కొండలు, గొబ్బి ఏసు, కాలతిరిపి కృష్ణ, కందుల రాయప్ప, కమల నాగేశ్వరరావు, చింతల రమేష్, మాల మహానాడు సభ్యులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
