ఆధునిక టెక్నాలజీతో అధునాతన వైద్య సేవలను అందరికీ అందించాలి: బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ….
ఈరోజు శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ లో డాక్టర్ ఆర్.వి.అరుణేంద్ర, డాక్టర్ భార్గవి ల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన “రాఘవి హాస్పిటల్” ను బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….ఆధునిక టెక్నాలజీతో కూడిన అధునాతన వైద్య సేవలను ప్రజలకు అందిస్తూ మానవసేవయే మాధవసేవగా దినదినాభివృద్ధి చెందాలన్నారు.
ఈ కార్యక్రమంలో హెచ్ఎంటీ మాజీ డాక్టర్ రెడ్డి వేణు, సూరారం డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, పోలే శ్రీకాంత్, జగద్గిరిగుట్ట శ్రీ వెంకటేశ్వర దేవస్థానం మాజీ చైర్మన్ వేణు యాదవ్, సీనియర్ నాయకులు డాక్టర్ హుస్సేన్, మక్సూద్ అలీ, సుధీర్, బ్రహ్మానంద చారి తదితరులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
