అల్విన్ కాలనీ డివిజన్ సమస్యలపై పాదయాత్ర చేసిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

Spread the love

అల్విన్ కాలనీ డివిజన్ సమస్యలపై పాదయాత్ర చేసిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

124 అల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని అంబేద్కర్ నగర్, సుభాష్ చంద్రబోస్ కాలనీ, గణేష్ నగర్, తారకరామ్ నగర్ కాలనీలలోని పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనుల పై డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ జి.ఎచ్.ఎమ్.సి అధికారులు మరియు కాలనీ వాసులతో కలిసి పాదయాత్ర చేసి సమస్యలను పరిశీలించడం జరిగింది.

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కాలనీలలో కొంతమేర డ్రైనేజీ మరియు సీసీ రోడ్లకు సంబందించిన పెండింగ్ వర్క్స్ ఉన్నాయని, వాటిని శేరిలింగంపల్లి శాసనసభ్యులు పి.ఎ.సి చైర్మన్ అరేకపూడి గాంధీ దృష్టికి మరియు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి శాంక్షన్ చేయించి అతి త్వరలో నిర్మాణ పనులు మొదలుపెడతామని హామీ ఇచ్చారు. కాలనీ లో మంజీరా వాటర్ ప్రెషర్ లేక ఇబ్బంది పడుతున్నామని కాలనీ మహిళలు కార్పొరేటర్ కి తెలియచేయగా కార్పొరేటర్ సంబంధిత జలమండలి అధికారులతో మాట్లాడి త్రాగు నీటి ప్రెషర్ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. పాదయాత్ర లో భాగంగా తారకరామ్ నగరలోని అంగనివాడి కేంద్రాన్ని సందర్శించి, పిల్లలకు అందిస్తున్న భోజనం మరియు వసతుల గురించి సిబ్బందితో మాట్లాడి విచారణ చేసారు. కాలనీలలో ఉన్న ప్రతీ సమస్యను నోట్ చేసుకుని పరిష్కరించాలని అధికారులకు తెలియచేశారు.

కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, సమ్మారెడ్డి, బోయకిషన్, షేక్ బీబీ, సంతోష్ ముదిరాజ్, సమ్మద్, జగదీష్, లింగం, సుధాకర్, సత్తయ్య, రమేష్, ఖలీమ్ మరియు కాలనీ వాసులు

జి.ఎచ్.ఎమ్.సి అధికారులు వర్క్ ఇన్స్పెక్టర్ రవి కుమార్, ఎంటమాలజీ సూపర్వైజర్ డి.నరసింహులు, UBD నాగరాణి, వాటర్ వర్క్స్ సూపర్వైజర్లు శ్రీనివాస్ మరియు శివ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top