రోడ్డు విస్తరణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్
ఉషముళ్ళపూడి కమాన్ నుండి గాజులరామరం వరకు వయా ఎల్లమ్మబండ ప్రధాన రహదారి 100 ఫీట్ రోడ్డు విస్తరణ పనులను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ జి.ఎచ్.ఎం.సి అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఎల్లమ్మబండ ప్రధాన రహదారిలో నిత్యం ట్రాఫిక్ సమస్య తో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు అని అన్నారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికై 100 ఫీట్ రోడ్డు విస్తరణ చేపట్టడం జరుగుతుందని, విస్తరణ పనులు వేగంగా చేసి ఎల్లమ్మబండ ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు తొలగిస్తామని అన్నారు. అదేవిధంగా వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి రోడ్డు మధ్యలో అడ్డంకిగా ఉన్న ఎలక్ట్రికల్ స్థంబాలను త్వరితగతిన స్థాన భ్రంశం చేయాలని, అదేవిధంగా రోడ్డు డివైడర్ మధ్యలో సుందరికరణ పనులు చేపట్టాలని, మౌలిక వసతుల కల్పనలో అలసత్వం ప్రదర్శించకుండా రోడ్డు విస్తరణ పనులు త్వరితగతిన చేపట్టి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో సమ్మారెడ్డి, గోపాల్, పోశెట్టిగౌడ్, సుధాకర్, ఎ.ఇ యుగంధర్ రెడ్డి, UBD నాగరాణి,వర్క్ ఇన్స్పెక్టర్ రవి కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
